- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జిన్నా.. గాంధీ, అంబేద్కర్ లతో సమానం: మహబూబా ముఫ్తీ
దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్బం గుడుపుకునే కశ్మీరీ పార్టీలు మరోమారు గొంతెత్తుతున్నాయి. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఏకంగా మహ్మద్ అలీ జిన్నా ను గాంధీ, అంబేద్కర్లతో పోల్చి నెట్టింట వైరల్ గా మారారు. భారత ప్రధాన మంత్రి పై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీషర్ల బూట్లు శుభ్రం చేసిన పార్టీ నాయకులు ఇప్పుడు దేశభక్తి గురించి చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
గాంధీ, అంబేద్కర్, వల్లభాయ్ పటేల్ లతో సమానంగా మహ్మద్ అలీ జిన్నా పోరాడారని అన్నారు. ఆ విషయాలు మనం మరిచిపోయామని కశ్మీర్ ప్రజలకు ద్వేశాన్ని నూరిపోశారు. ఇప్పుడు జిన్నా లాంటి నాయకుడిని విమర్శిస్తున్నాం అంటూ ప్రజలను ప్రశ్నించారు. దేశ విభజన కారణంగా మనం జిన్నాను ద్రోహిగా చూస్తున్నామని, ఇప్పుడు బీజేపీ కూడా అలానే చేస్తోందని విమర్శించింది. మత ప్రాతిపాదికన ఓట్లను చీల్చి పబ్బం గడుపుకుంటోంది అంటూ ఎద్దేవా చేశారు.