- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెహ్రీన్ వాచ్ చూశారా?
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా. మొదటి సినిమాతోనే టాలీవుడ్ మేకర్స్‌ను ఆకట్టుకున్న మెహ్రీన్.. యంగ్ హీరోలకు మంచి చాయిస్ అన్న ప్రశంసలు అందుకుంది. అంతేకాదు నటనలోనూ మంచి మార్కులే కొట్టేసింది. ఇక బాలీవుడ్‌లోనూ ‘ఫిలౌరీ’ సినిమాతో హిట్ కొట్టింది. ఆ తర్వాత ‘మహానుభావుడు, రాజా ది గ్రేట్’ సినిమాలతో వరుస సక్సెస్‌లు అందుకున్నా అదే జోరును కంటిన్యూ చేయలేక రేస్‌లో వెనకబడిపోయింది. ప్రస్తుతం అవకాశాలు లేకపోయినా.. ఈ బ్యూటీ లాక్‌డౌన్ టైమ్‌ను చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.
‘నేను చేస్తున్న పనిని ఎంతగానో ప్రేమిస్తాను. అయితే.. బిజీ షెడ్యూల్స్ వల్ల నాకిష్టమైన, ప్రియమైన వాళ్లతో సమయం గడిపే చాన్స్ రావడం లేదు. కానీ ఈ లాక్‌డౌన్ టైమ్‌లో నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడటానికి కావాల్సినంత టైమ్ దొరికింది. ఈ విలువైన సమయాన్ని నన్ను సంతోషపెట్టే విషయాలపై కేంద్రీకరిస్తున్నాను. ముఖ్యంగా నా రూమ్‌ను.. నాకిష్టమైన ఫేవరెట్ డ్రెస్సెస్, యాక్సెసరీస్‌తో నింపేస్తున్నాను. మరో ఇష్టమైన, సంతోషకరమైన పని ఏంటంటే.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయడం. ఈ రోజే నాకిష్టమైన ‘టెడ్ బేకర్ వాచ్’ డెలీవరీ అయ్యింది. చూశారా సింపుల్‌గా.. క్రిస్టల్స్‌తో ఎంత బాగుందో కదా’ అంటూ తన వాచ్‌ను చూపిస్తూ ఇన్‌స్టాలో ఓ ఫొటో పెట్టింది ఈ పంజాబీ భామ. చివరగా నాగశౌర్యతో కలిసి ‘అశ్వథ్థామ’ సినిమాలో కనిపించిన ఈ బ్యూటీ.. ఇంతవరకు మరో సినిమా సైన్ చేయలేదు. ప్రస్తుతానికి కరోనా టైమ్‌ను తన హ్యాపీనెస్‌కు దొరికిన విలువైన సమయంగా ఎంజాయ్ చేస్తోంది.