సీఎం జగన్‌గారికి ధన్యవాదాలు : చిరంజీవి

by srinivas |   ( Updated:2020-12-19 06:50:27.0  )
సీఎం జగన్‌గారికి ధన్యవాదాలు : చిరంజీవి
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా విస్తృతవ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ విధించడంతో సకల జనులు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా సినిమాలపైనే ఆధారపడి పడి జీవిస్తున్న వారి పరిస్థితి దారుణంగా తయారయింది. దీంతో సినీ కార్మికులను ఆదుకునేందుకు అగ్రహీరోలందరూ ముందుకొచ్చారు. ఎవరికి వారు తమకు తోచిన సాయం చేశారు. అందులో భాగంగానే తాజాగా తెలుగు సినీ పరిశ్రమను ఆదుకునేందుకు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. దీంతో సీఎం జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలియజేశారు. 'సినిమా రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా ఎగ్జిబిటర్స్‌ను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఏపీ సీఎం జగన్‌గారికి ధన్యవాదాలు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల థియేటర్లతోపాటు మరెంతో మంది కార్మకులకు లబ్ధి చేకూరుతుంద'ని చిరంజీవి ట్వీట్ చేశారు.

Advertisement

Next Story