- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మానుకోట నా అభిమాన కోట.. MLA శంకర్ నాయక్‌కు చిరంజీవి ఫోన్

దిశ, మహబూబాబాద్ : మానుకోట తన అభిమాన కోట అంటూ మెగాస్టార్ చిరంజీవి ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో సంభాషించారు. మానుకోటలో ఎంతో మంది తనకు అభిమానులు ఉండటం సంతోషించదగ్గ విషయమని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత లేకుండా ఉండేందుకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి సిలిండర్లను పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు చిరంజీవి ఫోన్ చేసి మాట్లాడారు.
హలో శంకర్ ఎలా ఉన్నారు.. కుటుంబ సభ్యులు బాగున్నారా.. ప్రజల్లో బాగా తిరుగుతారు, పరిస్థితులు అసలే బాగాలేవు.. ప్రజలకు బాగా ఉపయోగపడే వ్యక్తి మీరు, మీ ఆరోగ్యం జాగ్రత్త.. తగు జాగ్రత్తలు తీసుకోండి.. ప్రజల్లో బాగా గుర్తింపు పొందారు అంటూ సంభాషణ సాగించారు. తాము కోరిన వెంటనే జిల్లాకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ నుంచి సిలిండర్లు అందించినందుకు మెగాస్టార్‌కు ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.