ఆత్మహత్యలపై గొంతువిప్పేందుకు సిద్ధం : మీరాచోప్రా

by  |
ఆత్మహత్యలపై గొంతువిప్పేందుకు సిద్ధం : మీరాచోప్రా
X

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం.. ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీల్లోని లోపాలను, బంధు‌ప్రీతిని బయటపెడుతోంది. దాంతో పాటు సుశాంత్ మరణంపై నెటిజన్లు అనేక అనుమానాలు లేవనెత్తుతున్నారు. సుశాంత్‌ది సూసైడ్ కాదని.. హత్యేనని చాలా మంది తమ అభిప్రాయాలను, అనుమానాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖులపై, ఇండస్ట్రీ మాఫియాపై, నెపోటిజంపైనా సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ విషయంపై తమ వాయిస్ వినిపించారు. తాజాగా బంగారం మూవీ హీరోయిన్ మీరా చోప్రా తన ఇన్‌స్టా‌గ్రామ్ వేదికగా.. నటీనటులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారో చెప్పేందుకు తనతో పాటు ఎంతోమంది రెడీగా ఉన్నారంటూ.. తెలిపింది.

ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తెలియదని కామెంట్ చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన మీరా.. ఈ రకంగానైనా చాలా సంవత్సరాల ఆ తర్వాత వార్తల్లో నిలిచింది. అంతేకాక ఇటీవల మరణించిన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎవరు? అని ట్విట్టర్‌లో ప్రశ్నించి నెటిజన్స్‌తో గట్టిగానే విమర్శలు ఎదుర్కొంది. వెంటనే.. ఆ పోస్ట్ డిలీట్ చేయడం గమనార్హం. కాగా, ఇండస్ట్రీలో నటీనటులు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడుతారు? వారిని చావు అంచులదాకా తీసుకెళ్తున్న పరిస్థితుల గురించి నోరు విప్పేందుకు తనతో పాటు చాలా మంది ఉన్నారని తెలిపింది. అయితే ఇక్కడ.. మనం నోరు విప్పితే ఎంత మంది మనకు సపోర్ట్‌గా నిలుస్తారంటూ ప్రశ్నించింది. ‘సుశాంత్ ఆత్మహత్య తరువాత ఇదంతా ఆగిందా? లేదు కదా.. ఆ భయమే మనల్ని ఆ స్టెప్ తీసుకునేలా చేస్తోంది. అయితే అది కేవలం సినిమా వర్క్‌కు సంబంధించిందే కాదు. ఇండస్ట్రీలో చాలా విషయాల్లోనూ ఉంది. అది మన ఆత్మగౌరవం, డిగ్నిటీ, మన ప్రిన్సిపుల్స్‌తో పాటు మనశ్శాంతికి కూడా సంబంధించింది’ అంటూ మీరాచోప్రా ఇ‌న్‌స్టాలో పోస్ట్ చేసింది.


Next Story