- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ కళ్యాణ్‌కు అక్కగా.. అలనాటి స్టార్ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్ : ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో మీనా ఒకరు. అందంతో ఆనాటి కుర్రకారు మదిని దోచేసుకుంది. అంతే కాకుండా స్టార్ హీరోస్ అందరి సరసన ఈ ముద్దగుమ్మ నటించింది. చాలా రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు దృశ్యం సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇటీవల దృశ్యం 2 విడుదలైన విషయం తెలిసిందే. దగ్గుపాటి వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమాలో మీనా, వెంకటేశ్ భార్యగా నటించింది. ఇలా తనకు నచ్చిన పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు మరో సారి దోచుకుంటుంది.
అయితే స్టార్ హీరో సినిమాలో మీనా నటించబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వస్తున్న భవదీయుడు భగత్ సింగ్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్క పాత్రలో హీరోయిన్ మీనా నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. దీనికి మీనా ఒప్పుకోవడం కూడా జరిగింది అంటూ పలువార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే క్లారిటీ వచ్చేవరకు ఆగాల్సిందే.