పీపీఈ కిట్లు ధరించి హోలీ సంబరాలు.. ఎక్కడో తెలుసా.?

by Shamantha N |   ( Updated:2024-05-31 16:07:03.0  )
పీపీఈ కిట్లు ధరించి హోలీ సంబరాలు.. ఎక్కడో తెలుసా.?
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో హోలీ పండగ వేళ పలు రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. మధ్యప్రదేశ్‌లో హోలీ సందర్భంగా ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. ఆంక్షల నేపథ్యంలో ఉజ్జయినికి చెందిన ఐదుగురు వైద్య విద్యార్థులు వినూత్న రీతిలో హోలీ పండుగ జరుపుకున్నారు.

కరోనా వ్యాప్తి, జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా.. విద్యార్థులంతా పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి సంబరాలు చేసుకున్నారు. ఉజ్జయినిలోని ఫ్రీగంజ్‌ ప్రాంతంలో వీరంతా.. పీపీఈ కిట్లు, మాస్కులు ధరించి.. ఒకరికొకరు రంగులు పూసుకుని సంబరాలు చేసుకోవడం ప్రారంభించారు.

దారిన పోయేవారికి శుభాకాంక్షలు తెలపడం సహా పలువురితో హోలీ ఆడారు. జాగ్రత్తలు పాటించని వారికి మాస్కులు ధరించి సురక్షితంగా ఉండాలని సూచనలు చేశారు. హోలీని సురక్షితంగా ఎలా జరపాలి అనే విషయంపై అవగాహన కల్పించేందుకే ఈ రకంగా పండుగ జరుపుకున్నామని విద్యార్థులు వెల్లడించారు.

Advertisement

Next Story