- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైద్య విద్యార్థి ఆత్మహత్య.. కారణం అదే అంటున్న తండ్రి

X
దిశ, వెబ్‌డెస్క్ : సికింద్రాబాద్ జవహర్ నగర్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సునంద అనే విద్యార్థి తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హర్యానా రాష్ట్రానికి చెందిన మాజీ సుబేదార్ రాజ్‌బీర్‌సింగ్ కుమార్తె సునంద జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని దంత వైద్యకళాశాలలో బీడీఎస్ చదువుతోంది. ఎంబీబీఎస్‌లో సీటు రాకపోవడంతో సునంద తీవ్ర ఒత్తిడికి గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను సైకియాట్రిస్ట్‌కు చూపించారు. ప్రస్తుతం ఆమె బాగనే ఉందని మూడు రోజుల క్రితమే తన తల్లిదండ్రులతో ఫోన్ కూడా మాట్లాడినట్టు తండ్రి తెలిపాడు. అయితే డిప్రేషన్‌కు లోనై తాను ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story