- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిశ’ కథనానికి స్పందన.. రంగంలోని దిగిన అధికారులు
దిశ, గోదావరిఖని : ‘దిశ’ కథనంపై అధికారులు స్పందించారు. రామగుండం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో గోదావరిఖని కేసీఆర్ కాలనీలో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో డివిజన్ కార్పొరేటర్ నగునూరి రాజు, సుమలత ఎన్ని సార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా రెస్పాన్స్ లేదని ‘దిశ’లో వార్త ప్రచురించడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు.
కాలనీలోని పలు ఏరియాలను పరిశీలించి ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు, కార్పొరేటర్ నగునూరి రాజు, సుమలతలు దోమల బెడతా ఎక్కువగా ఉందని, పారిశుద్ధ్య లోపం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. వెంటనే శానిటేషన్‌ను మెరుగు పరచాలని శుభ్రంగా చేయాలని కోరారు.
స్థానిక 25వ డివిజన్ కేసీఆర్ కాలనీ, చంద్రబాబు కాలనీ, సాయి కాలనీ, పద్మావతి కాలనీలలో సుమారు 56 ఇళ్లలో మందు స్ప్రే చేశారు. ఇంటింటికి సందర్శిస్తూ దోమల లార్వాలను గుర్తిస్తూ నీటిని పారబోశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్, వైద్యాధికారి డాక్టర్ మాణికేశ్వర్ రెడ్డి, సబ్ యూనిట్ ఆఫీసర్ పెద్దపల్లి డీఎంఓ ప్రభాకర్, డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిట్టపల్లి మహేందర్, ఏఎన్ఎం పద్మ, బీడింగ్ చక్కర్ మహేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.