- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సమంత గురించి మాట్లాడం ఇష్టంలేక.. వారికి కండిషన్స్ పెట్టిన నాగ చైతన్య..?
దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల వార్త సోషల్ మీడియాలో రచ్చ లేపుతోన్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఈ వార్త గుప్పుమంటున్న అక్కినేని ఫ్యామిలీ నోరు మెదపకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సామ్ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి మాట దాటి వేసింది. మరోపక్క నాగ్ కానీ, చై కానీ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఎట్టకేలకు నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రమోషన్స్ కి మీడియా ముందుకు రానున్నాడు. ఇక ఈ సమయంలోనైనా ఈ విషయం గురించి అడగొచ్చని మీడియా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా నాగ చైతన్య మీడియాకు షాక్ ఇచ్చాడు.
లవ్ స్టోరీ ప్రమోషన్ కి ఆహ్వానించే మీడియా సంస్థ ప్రతినిధులకు చైతన్య పీఆర్ టీమ్ ఒక కండిషన్ పెట్టబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. సహజంగానే చైతన్య కనిపిస్తే మీడియా ఇదే ప్రశ్న వేస్తుంది అందుకే, ఆ ప్రశ్నల అడగకూడదని ముందే ఈ సినిమా మేకర్స్, పీఆర్వోల టీం మీడియాకి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మీడియా సంస్థ ప్రతినిధులకు ఈ సినిమాకు సంబంధించి ఏఏ ప్రశ్నలు అడగాలి అన్న కొశ్చనీర్ ముందుగానే తయారుచేసి ఇవ్వనున్నారట. ఈ విషయంలో నాగ చైతన్య చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్లు సమాచారం.
సామ్ తో విడాకుల వార్తలను అస్సలు ప్రస్తావించకూడదు అని తెలిపాడంట. తన సినిమా మాత్రమే హైలైట్ కావాలి. తన వక్తిగత జీవితం గురించి ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకుంటూ పొతే సినిమా సైడ్ అయిపోతుందని పీఆర్ టీమ్ చెప్తూ ఉన్నా.. సామ్ గురించి, విడాకుల గురించి మీడియా ముందు మాట్లాడం చైకి ఇష్టం లేదని, అందుకే ఆ విషయాలను పక్కన పెట్టాడని అభిమానులు గుసగుసలాడుతున్నారు. మరి ఇన్ని కండిషన్లతో ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్స్ ఎలా జరుగుతాయో చూడాలి.
ఇవి కూడా చదవండి: