సర్పంచ్, కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

by Shyam |
show cause notices
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: సర్పంచ్, కార్యదర్శులకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలోని కీసర మండలం యాద్గారిపల్లి సర్పంచ్ పుట్ట రాజు, కార్యదర్శి సుదర్శన్‌లకు కలెక్టర్ హరీష్ షోకాజు నోటీసులు జారీ చేశారు. 7వ హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను పరిరక్షించడంలో, అలాగే నర్సరీలను ఏర్పాటు చేయడంలోనూ నిర్లక్ష్యం వహించారనే కారణంగా ఈ షోకాజు నోటీసులు జారీ చేశారని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి పద్మజా రాణి వెల్లడించారు.

Advertisement
Next Story