- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంగన్‌వాడీలో ఖాళీల భర్తీకి చర్యలు
దిశ, వరంగల్: ములుగు జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్లు, ఆయాల ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని ములుగు జిల్లా కలెక్టర్ ఎస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో స్త్రీ-శిశు సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 548 మెయిన్, 92 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నట్లు తెలిపారు. మెయిన్ అంగన్ వాడీ కేంద్రాల్లో 51 టీచర్లు, 132 ఆయాలు, మినీ అంగన్‌వాడీ కేంద్రాల్లో 45 టీచర్లు, ఆయా పోస్టులు ఖాళీ ఉన్నట్లు వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే పదోన్నతులు, బదిలీలు, తొలగింపుల ప్రక్రియ పూర్తయిన పిదప ఖాళీల వివరాలు సమర్పించాలన్నారు. నియామక ప్రక్రియ నియమ నిబంధనల మేరకు పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గుత్తికోయలు నివాసముంటున్న అనుబంధ గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైతే సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ చోటుకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య సూచించారు.