విద్యుత్ బిల్లులపై డౌట్లుంటే రండి

by Shyam |

దిశ, న్యూస్‌బ్యూరో: లాక్‌డౌన్ సడలింపుల తర్వాత మూడు నెలలకు (మార్చి, ఏప్రిల్, మే) కలిపి జారీ చేస్తున్న విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని ఎవరైనా భావిస్తే సంబంధిత ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీసు(ఈఆర్వో)లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను సంప్రదించవచ్చని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) ఎండీ జి. రఘమారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బిల్లులపై వినియోగదారులకు ఉన్న సందేహాలను ఈఆర్వోల్లో నివృత్తి చేయడమే గాక వారి సమస్యలు పరిష్కరిస్తారని పేర్కొన్నారు. అంతేగాక ఈ మెయిల్([email protected]), ట్విట్టర్(TsspdclCorporat@twitter), ఫేస్‌బుక్(gmcsc.tsspdcl @facebook.com)కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారమవుతుందని తెలిపారు. ఈమెయిల్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌కు అందిన ఫిర్యాదులను రెండు పనిదినాల్లో పరిష్కరించాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. లాక్‌డౌన్‌లో తాము విజ్ఞప్తి చేసినట్లుగా ప్రొవిజనల్ బిల్లులు చెల్లించిన వాళ్లకు ఆ మొత్తం సర్దుబాటు చేస్తామని తెలిపారు. మూడు నెలల బిల్లు ఒకేసారి రావడంతో ఎక్కువ వచ్చిందని చాలామంది ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. సందేహాలుంటే నివృత్తి చేసుకొని త్వరగా కరెంటు బిల్లులు చెల్లించి సంస్థ మనుగడకు తోడ్పడాలని రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed