నేచుర్ క్యూర్ ఆస్పత్రిని సందర్శించిన మేయర్

by Shyam |
నేచుర్ క్యూర్ ఆస్పత్రిని సందర్శించిన మేయర్
X

దిశ, న్యూస్ బ్యూరో: నగర మేయర్‌ బొంతురామ్మోహన్‌ ఆదివారం నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రిని సందర్శించారు. అంకితభావంతో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కాగా, ప్రస్తుతం ఈ ఆస్పత్రి నందు క్వారంటైన్‌లో ఎవరూ లేరని అధికారులు మేయర్‌కు వివరించారు. హాస్పిటల్‌లో పారిశుధ్య పనులను తనిఖీ చేసిన మేయర్.. హాస్పిటల్‌ ఆవరణలో కొవిడ్‌-19 వైరస్‌ క్రిమిసంహారక మందు స్ర్పేయింగ్‌ను పరిశీలించారు. క్వారెంటైన్ సెంటర్లో ఉన్న వైద్య సేవలు, టెస్టింగ్‌ సదుపాయాల గురించి నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్యామల, రేవతి, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ భవానితో కలిసి మాట్లాడారు. ఆయనతో పాటు ఈవీడీఎం డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి, ఏఎంఓహెచ్‌ భార్గవ తదితరులు పాల్గొన్నారు.

Tags :Nature cure Hospital, Quarantine, Covid 19, Mayor

Advertisement

Next Story