ఇంజనీరింగ్ విద్యకు ఆ రెండు తప్పనిసరి

by Shyam |
ఇంజనీరింగ్ విద్యకు ఆ రెండు తప్పనిసరి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంజనీరింగ్ విద్యను చదివేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్ కోర్సులు తప్పనిసరని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇంజనీరింగ్ చదవాలనుకున్న విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్​లు అవసరం లేదని, అన్ని సబ్జెక్ట్ లకు చెందిన విద్యార్థులకు ఈ వెసులుబాటును కేంద్రం కల్పించింది. అయితే ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. తెలంగాణలో అలాంటి వెసులుబాటుని అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఇంటర్మీడియట్ లో తప్పనిసరిగా మ్యాథ్స్, ఫిజిక్స్ విభాగాలు చదివి ఉండాలని ప్రకటించింది. ఇతర సబ్జెక్ట్ లకు చెందిన విద్యార్థులను ఇంజనీరింగ్ విద్యకు అనుమతించబోమని జేఎన్ టీయూ, ఉన్నత విద్యమండలి, ఎంసెట్ బోర్డ్ ఏకభిప్రాయనికి వచ్చింది.

Advertisement

Next Story