తెలంగాణ ఇంటర్ ఫలితాలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే

by Veldandi saikiran |
తెలంగాణ ఇంటర్ ఫలితాలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్ విద్యార్థులకు బిగ్ అలర్ట్. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ( Telangana Inter results) కూడా అతి త్వరలోనే రిలీజ్ కాబోతున్నాయి. ఈ మేరకు ముహూర్తం కూడా ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఇంటర్ పరీక్ష ఫలితాలు ( Inter results) విడుదలైన సంగతి తెలిసిందే. ఏపీలో ఇంటర్ ఫలితాలు ( AP Inter results) రావడంతో తెలంగాణ రాష్ట్ర అధికారులు కూడా కసరత్తులు మొదలుపెట్టారు.

తెలంగాణ రాష్ట్ర ఇంటర్ ఫలితాలను కూడా విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల అంటే ఏప్రిల్ 25వ తేదీ లేదా 27వ తేదీలలో... ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం అందుతోంది.

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగిన పరీక్షలకు 9.96 లక్షల మంది హాజరయ్యారు. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి చేసి ఆన్లైన్ లో మార్కులు ఫీడ్ కూడా చేశారు అధికారులు. ఇక ఏప్రిల్ 20వ తేదీ నాటికి రీ -వెరిఫికేషన్ కూడా పూర్తి అవుతుందని చెబుతున్నారు అధికారులు. అంటే ఏప్రిల్ 25 తర్వాత ఏ క్షణమైనా ఫలితాలు విడుదలయ్యే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.



Next Story

Most Viewed