IPL 2025: చివర్లో తడబడ్డ గుజరాత్.. లక్నో టార్గెట్ ఎంతంటే?

by Gantepaka Srikanth |   ( Updated:2025-04-12 11:55:03.0  )
IPL 2025: చివర్లో తడబడ్డ గుజరాత్.. లక్నో టార్గెట్ ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌ 2025(IPL 2025)లో భాగంగా ఇవాళ లక్నోలోని అటల్ బిహారీ వాజ్‌పేయి మైదానం(Atal Bihari Vajpayee Stadium) వేదికగా గుజరాత్(Gujarat Titans), లక్నో(Lucknow Super Giants) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. దీంతో గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే.. గుజరాత్ బ్యాటర్లు.. అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చినా.. చివర్లో తడబడ్డారు. సాయి సుదర్శన్(56), శుభ్‌మన్ గిల్(60), రూథర్‌ఫోర్డ్(22) అద్భుతంగా రాణించారు.

దీంతో మొత్తంగా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన గుజరాత్(Gujarat) జట్లు.. 180 పరుగులు చేసింది. లక్నో జట్టు విజయం సాధించాలంటే 181 పరుగులు చేయాల్సి ఉంది. కాగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన గుజరాత్.. ఒక దాంట్లో ఓడి.. నాలుగింట్లో విజయం సాధించింది. ఇవాళ గెలిస్తే ఐదో గెలుపు ఖాతాలో పడనుంది. ఇక లక్నో(Lucknow) కూడా ఈ సీజన్‌లో ఐదు మ్యాచులు ఆడింది. రెండు మ్యాచుల్లో ఓటమి చవిచూడగా, మూడింట్లో విజయం సాధించింది. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని రెండు జట్లూ చూస్తున్నాయి.

Lucknow: ఐడెన్ మార్కరమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), హిమ్మత్ సింగ్, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, దిగ్వేష్ సింగ్ రాఠీ, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్.

Gujarat: సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్), వాషింగ్టన్ సుందర్, రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్.



Next Story