Mattam Palle Police: మఠంపల్లి ఎస్సై, ఏఎస్సైపై వేటు

by Sridhar Babu |   ( Updated:2021-05-27 03:28:34.0  )
Mattam Palle Police: మఠంపల్లి ఎస్సై, ఏఎస్సైపై వేటు
X

దిశ నేరేడుచర్ల: లాక్‌డౌన్ నేపధ్యంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా కంట్రోల్ చేయడంలో విఫలమవడంతో పాటు పలు కేసులలో అవినీతి ఆరోపణలు రావడంతో మఠంపల్లి ఎస్సై యల్లయ్యతో పాటు ఏఎస్సై రాంకోటిలపై పోలిస్ ఉన్నతాధికారులు వేటు వేశారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆసీస్ హెడ్ క్వార్టర్స్‌కు ఎటాచ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. మఠంపల్లి ఎస్సై ఎల్లయ్య బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే వేటు వేయడం సర్వత్రా మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై గురువారం పోలీస్ అధికారులు విచారణ చేపట్టినట్టు సమాచారం.

Next Story

Most Viewed