బాణాసంచా గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

by Aamani |
Fire-Accident
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్‌ నగర శివారులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శనివారం సాయంత్రం నగర శివారులోని మాధవనగర్ బైపాస్ రోడ్డులో ఉన్న సత్యనారాయణ కో అండ్ కంపెనీ టపాకాయల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. గోదాంలో టపాకాయలు ఉండటంతో మంటలు పెద్ద ఎత్తున్న చెలరేగాయి. ఘటన స్థలంలో ఎవరూ లేక పోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా.? లేక కావాలని ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed