ముసుగులు అమలు చేయాలి: పంజాబ్ సీఎం

by Anukaran |
ముసుగులు అమలు చేయాలి: పంజాబ్ సీఎం
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కోరలకు చిక్కి ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజుకు వేల సంఖ్యలో ప్రజలు దాని కోరలకు చిక్కి అవస్థలు పడుతున్నారు. వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంతమంది ప్రజల ఇబ్బందులు అంతా ఇంతా కాదు. తినడానికి తిండి లేక.. చేయడానికి పని లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరో పక్క కొంతమంది ప్రజలు తమకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కనీసం జాగ్రత్తలు పాటించడంలేదు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలేదు. మాస్కులు ధరించడంలేదు. సామాజిక దూరం పాటించడంలేదు. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ పలు విషయాలను ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మతపరమైన ప్రదేశాలలో సామాజిక దూరం పాటించాలన్నారు. ముఖ్యంగా ముసుగులు(మాస్కులు) అమలు చేయమని మత సంస్థల అధిపతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఈ విషయంలో క్రమం తప్పకుండా బహిరంగ ప్రకటనలు కూడా చేయాలని వారిని ఆయన రిక్వెస్ట్ చేశారు.

Advertisement

Next Story