డార్క్ నెట్‌లో కరోనా మాస్కుల అమ్మకాలు

by vinod kumar |
డార్క్ నెట్‌లో కరోనా మాస్కుల అమ్మకాలు
X

దిశ, వెబ్‌డెస్క్:
ఇప్పటివరకు క్రెడిట్ కార్డులు, డ్రగ్స్ మాత్రమే అక్రమంగా పెద్ద మొత్తాల చెల్లింపుతో చేతులు మారాయి. కానీ ఇప్పుడు కరోనా వైరస్ మాస్కులు కూడా ట్రేడ్ అవుతున్నాయి. వీటిని కొనడానికి బిట్ కాయిన్లు కూడా ఉపయోగిస్తున్నారు. కరోనా మహమ్మారి దెబ్బకు రక్షణ పరికరాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో డార్క్ నెట్‌లో కూడా అమ్మకానికి రెడీ అయ్యాయి. అమెరికా, యూరప్, రష్యా దేశాలకు చెందిన సైట్ ఇండెక్సింగ్ సెల్లర్లు అందరూ మాస్కులు, శానిటైజర్ల అమ్మకాలు మొదలుపెట్టారని బ్లాక్ చెయిన్ అనాలసిస్ కంపెనీ ఎలిప్టిక్ వెల్లడించింది.

సాధారణ సెర్చింజన్లకు దొరకని ఈ సైట్లలో అమ్మకాలు ప్రారంభమయ్యాయంటే వైరస్ ప్రభావం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు కరోనా పేషెంట్లకు చికిత్స చేయిస్తున్న వైద్య సిబ్బందికైనా రక్షణ పరికరాలు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్న సమయంలో డార్క్ నెట్‌లో మాస్కుల అమ్మకాలు జరుగుతుండటం శోచనీయం. మాస్కుల సరఫరా కొరత కారణంగా ఇప్పటికే చాలా మంది వైద్యసిబ్బంది వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అయితే గమ్యస్థానం చేరేలోపే అడ్డు తప్పించిన మాస్కులే ఇలా డార్క్ నెట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంటున్నాయని సైబర్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags: Dark web, Dark net, Site indexing, masks, Corona, Covid-19

Advertisement

Next Story

Most Viewed