శానిటైజర్లు, మాస్క్‌లిచ్చే వెండింగ్ మెషిన్

by sudharani |
శానిటైజర్లు, మాస్క్‌లిచ్చే వెండింగ్ మెషిన్
X

ఒకప్పుడు రైల్వే స్టేషన్లలోని వెండింగ్ మెషిన్లలో చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్‌డ్రింక్స్ అందుబాటులో ఉండేవి. కానీ కరోనా కారణంగా వెండింగ్ మెషిన్లలో ప్రస్తుతం శానిటైజర్లు, మాస్క్‌లు పెట్టాల్సి వస్తోంది. అవును.. చాలా మంది ప్రయాణికులు మాస్క్ లేకుండానే రైల్వే స్టేషన్లకు వస్తున్న నేపథ్యంలో తూర్పు మధ్య రైల్వే పరిధిలోని పాట్నా జంక్షన్‌లో ఆటోమేటెడ్ మాస్క్, శానిటైజర్ డిస్పెన్సర్ (ఎంఎస్‌డీ) మెషిన్ ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు చేసిన మెషిన్లలో ఇది రెండోది. కాగా గతంలో మే 18న నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లోనూ ఇలాంటి వెండింగ్ మెషిన్ ఏర్పాటు చేశారు.

మహారాష్ట్ర నుంచి బీహార్‌కు పంపిస్తున్న వలస కార్మికుల్లో చాలా మందికి సరైన మాస్క్ కూడా లేకపోవడంతో భారతీయ రైల్వే ఇలాంటి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మాస్క్ మరిచిపోయిన వారికి, తరచుగా చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలనుకున్నవారికి ఇది చాలా ఉపయోగపడనుంది. అలాగే రానున్న రోజుల్లో రైల్వే స్టేషన్లన్నింటినీ పూర్తిగా కొవిడ్ ఏర్పాట్ల సహిత రైల్వేస్టేషన్లుగా మార్చనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed