- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వైద్యులకు మాస్క్‌లు ఉండనిద్దాం…
దిశ, వెబ్‌డెస్క్: దేశం క్లిష్ట సమయాల్లో ఉంది. అన్నింటికి కొరత ఏర్పడుతోంది. సరైన వైద్య పరీక్షలు అందిద్దామనుకున్న వైద్యులకు …. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్(పీపీఈ), ఎన్ 95 మాస్క్‌ల కొరత. ఇలా అన్నింటిలోనూ ఇబ్బందులే చవిచూడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన మద్ధతు కోరుతున్నారు ప్రముఖులు. ఎన్ 95 మాస్క్‌లను వైద్య సిబ్బందికి అందించి.. మన ఇంట్లో మనం మాస్క్‌లు తయారు చేసుకుందామని పిలుపునిస్తున్నారు. తద్వారా కొందరి ప్రాణాలు రక్షించనవారిమి అవుతామంటున్నారు. ప్రభుత్వం మాస్క్‌ల కొరత తగ్గగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా… మన సహాయం అందించడంలో తప్పు లేదంటున్నారు.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాస్క్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించారు. మాస్క్‌తో ఉన్న తన పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన విజయ్… మీరంతా క్షేమంగా ఉన్నానని భావిస్తున్నానని అన్నారు. క్లాత్‌తో ఫేస్ కవర్ చేసుకోవడం వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందని తెలిపారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది కోసం మెడికల్ మాస్క్‌లను ఉండనిద్దామని… ఇంట్లోనే శుభ్రమైన వస్త్రంతో హోమ్ మేడ్ మాస్క్ తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. హ్యాండ్ ఖర్చీఫ్, స్కార్ఫ్, అమ్మ కొంగును కూడా మాస్క్‌గా వాడుకోవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెడికల్ మాస్క్‌లు వైద్యులకు చాలా అవసరమన్నారు. మీ మొహాన్ని క్లాత్‌తో కవర్ చేసుకుని సేఫ్‌గా ఉండాలని సూచించారు విజయ్.
హీరోయిన్ రాశీఖన్నా… హోమ్ మేడ్ మాస్క్ తయారు చేసుకోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. స్కార్ఫ్‌తో కవర్ చేసిన తన మొహాన్ని షేర్ చేసిన రాశీ… మీరు హ్యాండ్ ఖర్చీఫ్స్, దుపట్టా, స్కార్ఫ్‌లను మాస్క్‌లుగా యూజ్ చేసుకోవచ్చని తెలిపారు. కానీ ఇవి కొంత మేర రక్షణ ఇచ్చినా… ఇంట్లో మాస్క్‌లు తయారు చేసుకోవాలని సూచించారు. మాస్క్‌లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తూ లింక్ షేర్ చేసింది.
మనకన్న మన డాక్టర్స్‌కు మాస్క్‌లు చాలా ముఖ్యమని చెబుతున్నారు హీరో సుశాంత్. కరోనా పేషెంట్లను ట్రీట్ చేస్తున్న వైద్య సిబ్బందికి ఎన్95 మాస్క్‌లు అవసరమని… ప్రస్తుతం దేశంలో ఈ మాస్క్‌ల కొరత ఉందన్నారు. కనుక మనం మన ఇంట్లోనే శుభ్రమైన వస్త్రాన్ని ఉపయోగించి … మాస్క్‌లను తయారు చేసుకుందామని కోరారు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేస్తూ.. మళ్లీ మళ్లీ వినియోగించుకునేలా కూడా ఉంటుందని తెలిపారు. అత్యంత అవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని… వైరస్ నుచి రక్షించుకునేందుకు ఇంట్లోనే ఉండాలని కోరారు.
Tags : MaskIndia, Vijay Devarakonda, Raashi Khanna, Sushanth, CoronaVirus, Covid19