- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వ్యాక్సిన్ వచ్చినా.. భౌతిక దూరం, మాస్క్ తప్పనిసరి
దిశ, వెబ్ డెస్క్: కరోనా నివారణ వాక్సిన్ వచ్చినా మాస్కులు, భౌతిక దూరం తప్పనిసరి అని అమెరికా శాస్త్రవేత్తలు స్ఫష్టంచేశారు. బేలర్ మెడికల్ కాలేజ్‌లో నేషనల్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ అసోసియేట్ డీన్‌గా పనిచేస్తున్న మరియా ఎలెనా బొటాజ్జి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్ కరోనాను తగ్గిస్తుందేమో కానీ, పూర్తిగా తొలగించలేదని పేర్కొన్నారు. ‘వాక్సిన్ వేసుకున్నాక గత సంవత్సరం ఎలా ఉన్నానో అలాగే ఉందామని ప్రజలు అనుకోవచ్చు. కానీ అది పూర్తిగా తప్పన్నారు. మొదట వ్యాక్సిన్ అద్భుతాలు సృష్టించకపోవచ్చు అందువల్లే మాస్కులు, భౌతిక దూరం పాటించాల్సిందే’ అని బొటాజ్జి చెప్పారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 150 రకాల వ్యాక్సిన్ల తయారీ వివిధ దశల్లో ఉంది. అందులో 26 టీకాలకు మానవులపై ప్రయోగించేందుకు అనుమతి లభించింది. ఈ 26లో 5 వాక్సిన్లు మూడో (చివరి) దశ క్లినికల్ పరీక్షల్లో ఉన్నాయి. కాగా చివరి దశలో వేలాది మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో టీకా భద్రత, సామర్థ్యాన్ని పరీక్షించనున్నారు. కరోనా అత్యవసర సమయంలో వినియోగించేందుకు మోడెర్నా, ఫిజర్, ఆస్ట్రాజెనెకా లాంటి కంపెనీలు వైరస్ వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం భారత్‌లో మానవులపై రెండు రకాల వ్యాక్సిన్లను పరీక్షిస్తున్నారు.
జాన్హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 17.5 మిలియన్ల ప్రజలు కొవిడ్ బారిన పడ్డారు. మహమ్మారితో 6,78,775 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కేసుల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. దేశంలో 17 లక్షల మందికి వైరస్ సోకగా 36,511 మంది మృతిచెందారు.