- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మురికికూపంగా మాసాబ్ చెరువు
దిశ, అబ్దుల్లాపూర్‌మెట్: తుర్క యంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్‌చెరువు మురికికూపంగా మారుతోంది. చెరువులో విచ్చలవిడిగా వ్యర్థాలను పడవేస్తూ తటాకం ఉనికిని దెబ్బతీస్తున్నారు. గత వ ర్షాకాలంలో భారీవర్షాలతో చెరువు నిండుకుండలా స్వచ్ఛంగా ఉన్నా… తుర్కయంజాల్, కమ్మగూడ, రాగన్నగూడ నుంచి వస్తున్న డ్రైనేజీ అంతా చెరువులోనే కలుస్తోంది.
ఇటువైపున బడంగ్‌పేట, గుర్రంగూడ నుంచి కూడా కొన్ని గ్యాలన్ల డ్రైనేజీ, మురికి నీరంతా చెరువులోనే కలుస్తూ మరో హుస్సేన్‌సాగర్‌ను తలపిస్తోంది. చెరువు కట్టపై ఉన్న మైసమ్మ ఆలయానికి నిత్యం పదుల సంఖ్యలో భక్తులు గొర్రెలు, మేకలు, కోళ్లు వంటి వాటిని బలి ఇస్తూ, వాటి వ్యర్థాలనంతా చెరువులోనే పడేస్తున్నారు. ఆలయం వెలుపల పడిన రక్తం, ఇతరత్రా వాటిని నేరుగా ఓ పైపు ఏర్పాటు చేసి చెరువులోనే కలిసేలా ఏర్పాట్లు చేశారు. పైకి సుందరంగా కన్పిస్తున్న చెరువును చూసేందుకు వచ్చిన పర్యాటకులకు ముక్కు పూటాలు పలిగే విధంగా వాసన వస్తుండటంతో ఎక్కువ సేపు నిలబడలేక, కూర్చోలేకుండా ఉంది. సాయంత్రం పూట దోమలు విపరీతంగా వస్తున్నాయి. చెరువు కట్టపై ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ మీద కూర్చొని మందురాయుళ్లు తాగుతుండటంతో పర్యా టకులకు ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా చెరువు తూము దగ్గర పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. తూము దగ్గరకు వెళ్లేందుకు నేరుగా దారి ఉండటంతో మలవిసర్జన చేస్తున్నారు. ఇటీవల తూము విప్పేందుకు వచ్చిన ఇరిగేషన్ అధికారులు లోనికి వెళ్లలేక ఇబ్బంది పడ్డారు. చెరువు దగ్గర ఈ పరిస్థితిని అరికట్టాలని, వ్యర్థాలను బయట ఎక్కడో పడేసే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
చెరువును కాపాడాలి..
మాసాబ్‌చెరువు ప్రస్తుతం కళకళలాడుతోంది. దీన్ని కాపాడుకునేందుకు అందరూ తమవంతుగా కృషి చే యాలి. చెరువులో మురికి కలవకుండా చర్యలు తీసుకోవాలి, డ్రైనేజీ నీరు కలిసే దగ్గర ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధి చేసిన తర్వాత లోనికి పంపాలి.
-అంజి,స్థానికుడు