- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మారుతీ సుజుకి నికర లాభం రూ. 1,372 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకి ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో నికర లాభం 1 శాతం పెరిగి రూ. 1,371.6 కోట్లుగా నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 1,358.6 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఈ కాలంలో పెట్టుబడుల మిగులు, తక్కువ పన్ను కేటాయింపుల లాభాల కారణంగా నికర లాభాలు మెరుగ్గా ఉన్నాయని గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ పేర్కొంది.
సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ నికర అమ్మకాల విలువ రూ. 17,689.3 కోట్లుగా నమోదయ్యాయని, గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 16,120.4 కోట్లతో పోలిస్తే ఈసారి 9.7 శాతం పెరిగిందని వెల్లడించింది. అధిక అమ్మకాల పరిమాణం, తక్కువ ప్రమోషన్ ఖర్చులు, నిర్వహణ ఖర్చుల తగ్గింపు, వ్యయ తగ్గింపు ప్రయత్నాల వంటి పరిణామాలతో సంస్థ నిర్వహణ లాభం గతేడాది కంటే 71.7 శాతం పెరిగి రూ. 1,167.7 కోట్లకు చేరుకుంది.