- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెలలో రెండోసారి వాహన ధరలు పెంచిన మారుతీ సుజుకి!
దిశ, వెబ్‌డెస్క్: అధిక ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించుకునేందుకు దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి మరోసారి కార్ల మోడళ్లపై ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై మాత్రమే ఈ ధరల పెంపు ఉంటుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. తాజా ధరలు శుక్రవారం నుంచే అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే, ఏ ఏ మోడళ్లపై ధరల పెరుగుదల ఉంటుందనేది కంపెనీ స్పష్టం చేయలేదు. ఎంచుకున్న మోడళ్లపై సగటు ధరల పెంపు 1.6 శాతం ఉంటుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వివరించింది. కాగా, మారుతీ సుజుకి తన కార్లపై ధరలను పెంచడం ఈ నెలలో రెండోసారి. ఫిబ్రవరి తర్వాత మూడోసారి ధరలను పెంచింది. ముడి పదార్థాల వ్యయంలో పెరుగుదలను తగ్గించేందుకు ఏప్రిల్ నుంచి పలు మోడళ్ల ధరలను పెంచుతున్నట్టు కంపెనీ మార్చి 22న ప్రకటించింది. గతేడాది సైతం ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల కంపెనీకి వాహనాల వ్యయం ప్రతికూలంగా ప్రభావితమైనట్టు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ధరల పెంపు ద్వారా వినియోగదారులపై ఈ భారం అనివార్యమని కంపెనీ అభిప్రాయపడింది.