- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మారుతీ సుజుకి అమ్మకాలు వృద్ధి
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ అక్టోబర్ నెలలో రికార్డు స్థాయిలో 1,66,825 యూనిట్లను డీలర్‌షిప్‌లకు పంపిణీ చేసినట్టు వెల్లడించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈసారి 17.9 శాతం అధికం. అలాగే, నవంబర్‌లో దీపావళి సందర్భంగా అమ్మకాలు మరింత మెరుగ్గా ఉంటాయని మారుతీ సుజుకి ఆశాభావం వ్యక్తం చేసింది. అక్టోబర్‌లో కంపెనీ మొత్తం 1,82,448 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇందులో టయోటా కిర్లోస్కర్‌కు సరఫరా చేసిన బలెనొ, బ్రెజా మోడళ్లు 6,037 యూనిట్లు, ఎగుమతులు 9,586 యూనిట్లు ఉన్నాయి.
గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే అమ్మకాలు 18.9 శాతం పెరిగాయి. ‘అక్టోబర్ నెల తమతో పాటు పరిశ్రమకూ సానుకూలంగానే ఉంది. వచ్చే నెలలో కూడా అమ్మకాలు మెరుగ్గా ఉంటాయి. డిసెంబర్‌లో అన్ని కంపెనీలు ఆఫర్లు, డిస్కౌంట్లను అందించడంతో పాటు అమ్మకాలౌ పెంచే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ ఏడాది ఆటో పరిశ్రమ సానుకూలంగా ముగుస్తుందనే నమ్మకముంది. వచ్చే ఏడాది ఎలా ఉండనుందనేది ఊహించలేమని మారుతీ సుజుకి ఇండియా ఛైర్మన్ ఆర్ సి భార్గవ చెప్పారు. ప్రస్తుతం ఉత్పత్తి జరిగిన స్థాయిలో అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వాహనాలపై జీఎస్టీ తగ్గింపు అవసరంలేదని గత వారం ఆయన అభిప్రాయపడ్డారు. డిమాండ్ ఉప్తత్తిని మించి మారితే విక్రయించేందుకు కార్లు ఉండవు. డిమాండ్ పరిస్థితిపై కొంతవరకు స్పష్టత వచ్చాక, 2021లో జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం తీసుకోవచ్చని భార్గవ పేర్కొన్నారు.