ఆ కార్లపై దృష్టి సారించనున్న మారుతీ సుజుకి

by Harish |
ఆ కార్లపై దృష్టి సారించనున్న మారుతీ సుజుకి
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా 2021-22 ఆర్థిక సంవత్సరంలో తన సీఎన్‌జీ ఆధారిత కార్ల అమ్మకాలు 2.5 లక్షల యూనిట్లకు చేరుకుంటాయని భావిస్తోంది. ప్రభుత్వం సీఎన్‌జీని వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని, దీనివల్ల గ్యాస్ చౌకగా మారుతుందని మారుతీ సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు. వినియోగదారులు కూడా సీఎన్‌జీ ఆధారిత వాహనాల పట్ల ఆసక్తి చూపించనున్నారు. రాబోయే సంవత్సరాల్లో డిమాండ్ తీర్చేందుకు కంపెనీ తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తుందని శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు.

డీజిల్‌తో పోల్చినప్పుడు సీఎన్‌జీ వాహనాలు పర్యావరణ అనుకూలమైన ఎంపికగా మారనుంది. గతేడాది నుంచే కంపెనీ డీజిల్ వాహనల అమ్మకాలను నిలిపేసింది. ఈ నష్టాలను అధిగమించడానికి సీఎన్‌జీ మోడళ్ల విభాగంలోకి విస్తరించాలని ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. గతేడాది గణాంకాల ప్రకారం సీఎన్‌జీ వాహనల అమ్మకాలు 15.5 శాతం వార్షిక సగటు వృద్ధిని నమోదు చేస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story