- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భార్య మృతి.. పోలీసుల అదుపులో భర్త
by Sumithra |

X
దిశ, కోదాడ : భార్య అనుమానాస్పద మృతి కేసులో పోలీసులు భర్తను అదుపులోకి తీసుకున్నారు. వివరాళ్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా గొల్లగూడెంకు చెందిన షేక్ షిమా (30). ఇదే పట్టణానికి చెందిన గులాం అంజు భాయ్‌తో 10 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ బాబు ఉన్నాడు. కాగా, భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇంతలో ఏం జరిగిందో ఏమో గానీ.. బుధవారం షేక్ షిమా అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని భర్తను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Next Story