సెన్సెక్స్ 1862… నిఫ్టి 497 ఎగబాకి

by Harish |
సెన్సెక్స్ 1862… నిఫ్టి 497 ఎగబాకి
X

కరోనా వైరస్ మహమ్మారి భయాందోళనల నేపథ్యంలో కొద్ది రోజులుగా దేశీయ మార్కెట్లు చిగురుటాకులా వణికిపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పతనాలను ఎదుర్కొంటున్నాయి. రూ. లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరై పోతోంది. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి భారత ప్రభుత్వం మంగళవారం అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు లాక్‌డౌన్ ప్రకటించింది. కరోనాను ఎదుర్కోవడానికి తగిన వైద్య వసతులు కల్పించడానికి రూ. 15,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ చర్యలు దేశీయ మార్కెట్లు తేరుకోవడానికి అవకాశం కల్పించాయి. బుధవారం ఉదయం ట్రేడిగ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే మార్కెట్లు లాభాల బాట పట్టాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్ 1862 పాయింట్లు లేదా 6.98 శాతం లాభంతో 28,536 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టి 497 పాయింట్లు లేదా 6.37 శాతం లాభపడి 8,298 పాయింట్ల వద్ద స్థిరపడింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ప్రధాన లబ్ధిదారుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఆ కంపెనీ షేర్లు 14.65 శాతం లాభపడ్డాయి. కోటక్ మహీంద్ర, మారుతి, హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్, ఎల్ అండ్ టీ షేర్లు బాగానే లబ్ధిపొందాయి. ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీ, ఐటీసీ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

Tags: Stock market today, nifty, sensex, corona effect stock market

Advertisement
Next Story

Most Viewed