రక్షా బంధన్.. అడవి నుంచి ఇంటికి రప్పించింది

by Shamantha N |
రక్షా బంధన్.. అడవి నుంచి ఇంటికి రప్పించింది
X

దిశ, వెబ్ డెస్క్: రక్షా బంధన్.. ఓ మావోయిస్టు‌ను అడవికి శాశ్వతంగా స్వస్తి పలికాడు. తన సోదరి చేసిన విజ్ఞప్తి రక్షా బంధన్… అడవి నుంచి ఇంటికి వచ్చేలా చేసింది. ఈ మేరకు నక్సలిజాన్ని వదిలి ఇంటికి చేరాడు. ఈ ఘటన చత్తీస్‌ఘడ్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి దంతెవాడ జిల్లా పల్నార్ గ్రామంలో మల్లా అనే వ్యక్తి తన 12 వ ఏటానే ఇంటిని వదిలేసి అడవుల బాట పట్టాడు. నక్సలిజం ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ 14 ఏళ్లుగా ఇంటి ముఖం చూడలేదు. నక్సలైట్‌లో మల్లా ప్లాటూన్ డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎదిగాడు.

దీంతో అతని తలపై పోలీసులు రూ. 8 లక్షల రివార్డు ప్రకటించారు. దీంతో అతని సోదరి లింగే ఆందోళన చెందింది. పోలీసులు తన అన్నను చంపుతారేమోనన్న భయం వెంటాడింది. దీంతో రక్షా బంధన్ రోజు అన్న మల్లాకు ఇంటికి రావాలని విజ్ఞప్తి చేసింది. దీంతో అన్న మల్లా అడవికి స్వస్థి చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోయి సోదరితో రాఖీ కట్టించుకున్నాడు. జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన మల్లాకు పునరావాసం కల్పిస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ హామీ ఇచ్చారు.

Advertisement

Next Story