- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వంపై సమర శంఖం పూరించిన మంథని రైతాంగం
దిశ, మంథని: ప్రభుత్వంపై పోరాటానికి పెద్దపల్లి జిల్లా మంథని రైంతాంగం సమర శంఖం పూరించింది. మంథని ఎగువ ప్రాంతంలోని ఎస్సారెస్పీ ఏరియా భూములకు సాగు నీరందించాలన్న డిమాండ్‌తో ప్రత్యక్ష్య ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పార్టీలకు అతీతంగా మంథని ప్రాంత రైతాంగం అంతా కలిసి పోరాటానికి పూనుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తాజాగా.. గురువారం ఉదయం మంథని నుండి పెద్దపల్లి కలెక్టరేట్ వరకు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు.
30 వేల ఎకరాల కోసం..
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతమైన మంథని ఎగువ ప్రాంతానికి సాగునీరు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెలెండ్ ఏరియా కావడంతో కాలువల ద్వారా నీరు అందడం లేదని, దీంతో సిరులు పండాల్సిన తమ భూముల్లో పంట పండించడానికి అప్పు చేయాల్సిన దుస్థితికి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా.. ఈ ప్రాంతంలోని 30 వేల ఎకరాల భూముల్లో ఆలస్యంగా పంట పండించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పొలాల మధ్యలో కాలువలు ఉన్నా చుక్కనీరు రావడం లేదని వాపోయారు. ఈ క్రమంలో తమకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోతారం లిఫ్టే దిక్కు..
ప్రభుత్వం పోతారం వద్ద లిఫ్ట్‌ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. పోతారం నుండి నీటిని కన్నాల, రచ్చపల్లి వద్దకు ఎత్తిపోయించాలని, అక్కడి నుండి మోటార్ల సాయం లేకుండానే కాలువల ద్వారా పొలాలకు నీటిని తరలించవచ్చని చెబుతున్నారు. ఈ మేరకు రెండేళ్ల క్రితం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, అయినా నేటికీ మంజూరు చేయలేదని మండిపడుతున్నారు. కన్నాల, రచ్చపల్లి గ్రామాల సమీపంలో నీరు నిల్వ ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటే సరిపోతుందని రైతులు వెల్లడిస్తున్నారు. ఎస్సారెస్పీ కాలువల్లో నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేస్తే 30 వేల ఎకరాల్లో పంటలు పండించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. పంటలకు సాగునీరు అందించేంతవరకు తమ పోరాటం కొనసాగుతుందని రైతులు స్పష్టం చేస్తున్నారు.