కేంద్ర ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజర్‌గా పేపర్ బాయ్..

by Shyam |
Man’s journey
X

దిశ, ఫీచర్స్: యువతరాన్ని ఇన్‌స్పైర్ చేసే స్టోరీస్‌ను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో షేర్ చేసే ‘హ్యుమన్స్ ఆఫ్ బాండే ఆర్గనైజేషన్’ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని వీడియో రూపంలో పంచుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. మురికివాడలో పెరిగిన యువకుడు ప్రస్తుతం కేంద్రప్రభుత్వానికి సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఎలా మారాడు? ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో అతడి పాత్ర ఎంత? అతడి స్ఫూర్తిదాయక జర్నీ విశేషాలేంటో తెలుసుకుందాం..

ఢిల్లీలోని ఓ స్లమ్ ఏరియాకు చెందిన న్యూస్ పేపర్ ఏజెంట్ కొడుకు ఆర్యన్ మిశ్రా. ఫ్యామిలీ ఎకానమికల్ పొజిషన్ వల్ల పొద్దున పేపర్ బాయ్‌గా పనిచేస్తూ, ఆ తర్వాత స్కూల్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో సైబర్ కేఫ్‌లో కూడా పని చేసిన ఆర్యన్.. సైన్స్ పట్ల తనకున్న ఇంట్రెస్ట్‌తో స్థానికంగా ఉండే ఇంటర్నెట్‌ కేఫ్‌లో పలు సైంటిఫిక్ విషయాలపై స్టడీ చేశాడు. ఈ మేరకు ఖగోళ శాస్త్రం‌పై కొంత అవగాహన పెంచుకున్నాడు. ఇక అప్పటి నుంచే ఆస్ట్రోనాట్ కావాలని కలలు కన్న ఆర్యన్.. ఆస్ట్రానమీ రంగంలో తనదైన స్థాయిలో కృషి చేయాలనుకున్నాడు. అలా 14 ఏళ్ల వయసులోనే ఓ ఆస్టరాయిడ్‌ను కనుగొనగా, మంచి గుర్తింపు లభించింది. ఈ క్రమంలో నేషన్ వైడ్ ఆస్టరాయిడ్ సెర్చ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి మరింత నాలెడ్జ్‌ సంపాదించాడు. ఆ తర్వాత తనలాగే పాషన్ ఉన్న స్టూడెంట్స్‌కు ఖగోళ శాస్త్రం గురించి మరిన్ని విషయాలు తెలిపేందుకు, వారి ఇన్నోవేటివ్ థాట్స్ తెలుసుకునేందుకు ‘స్పార్క్ ఆస్ట్రానమీ’ పేరిట ఓ స్టార్టప్ ప్రారంభించిన ఆర్యన్.. మరోవైపు ‘ఆస్ట్రానమికల్ సొసైటీ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడు. ఇక తన స్టార్టప్ ద్వారా మొదట ప్రైవేటు స్కూల్స్‌లో టెలిస్కోప్స్, ఇతర డివైజెస్‌తో లేబొరేటరీలు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో అతడి ఆలోచనను మెచ్చిన కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ.. ప్రభుత్వ పాఠశాలల్లో లేబొరేటరీలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుని, ఇందుకు అతడి సాయాన్ని కోరింది.

ప్రస్తుతం ఆర్యన్ సలహాలు, సూచనల మేరకే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ఆస్ట్రానమీ లేబొరేటరీలను నిర్మిస్తోంది. కాగా కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఉన్న ఆర్యన్ మిత్రా లైఫ్ జర్నీ మొత్తం.. ‘న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఈ స్థాయి వరకు ఎలా కొనసాగిందో?’ తెలుపుతూ రూపొందించిన వీడియో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు ఆర్యన్‌కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఇన్‌స్పైరింగ్ స్టోరీ, రెస్పెక్ట్ ఫర్ యూ అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed