నయన్‌ నటన అద్భుతం : మంజు వారియర్

by Shyam |
నయన్‌ నటన అద్భుతం : మంజు వారియర్
X

మలయాళ లేడీ సూపర్ స్టార్ మంజు వారియర్ నటనకు చాలా మంది అభిమానులున్నారు. తన అభినయంతో నేషనల్ లెవల్‌లో గుర్తింపు పొందిన ‘మంజు వారియర్’ తమ సినిమాలో ఉంటే చాలు.. ఫుల్ క్రేజ్ వచ్చేస్తుందని అనుకుంటారు దర్శక, నిర్మాతలు. అలాంటి సూపర్‌స్టార్ మరొకరి నటన గురించి ప్రశంసించడం చాలా అరుదు. కానీ ఈ లేడీ సూపర్‌స్టార్ మరో లేడీ సూపర్‌స్టార్‌ను పొగడ్తల వర్షంలో ముంచెత్తింది. వరుస ఆఫర్లు దక్కించుకుంటూ సూపర్ సక్సెస్‌లతో దూసుకెళ్తున్న నయనతారకు భారీ కాంప్లిమెంట్స్ ఇచ్చింది.

పని పట్ల నయన్‌కున్న ప్రేమ, అంకితభావాన్ని ప్రశంసించింది. సినిమా ఇండస్ట్రీలో మహిళలు బలంగా ఉండగలరని తను నిరూపించిందని.. నిజంగా ఆమె లేడీ సూపర్‌స్టార్ అని కితాబిచ్చింది. ‘నయన్ సినిమాలు చూడటం చాలా ఇష్టం.. పాత్రలకు అనుగుణంగా తనను తాను మలుచుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. కేరళకు చెందిన నయన్.. తమిళ చిత్ర పరిశ్రమను శాసించడం గొప్ప విషయమని’ మంజు వారియర్ చెప్పింది.

కాగా ప్రస్తుతం నయనతార ‘మూకుతి అమ్మన్’, ‘నేట్రికాన్’ ‘అన్నాత్తే’ చిత్రాల్లో నటిస్తుండగా.. మంజు వారియర్ మలయాళ చిత్రం ‘మరక్కర్: అరబికాడింటె సింహం’లో కనిపించనున్నారు.

Advertisement

Next Story