- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, మన్సూరాబాద్: డివిజన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో నడిరోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ పైకప్పు లోపలికి కూరుకుపోయి గజం లోతు గుంత ఏర్పడింది. ఇటీవల పిల్లలు ఆడుకుంటూ అందులో పడి గాయాలు కావడం గమనార్హం. పది నెలల నుంచి అలాగే ఉంటున్నా అధికారులెవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు చెబుతున్నారు. నిత్యం వందలాది మంది కాలనీవాసులు, వాహనదారులు ఈ దారి గుండానే ప్రయాణిస్తుంటారు. చిన్నపిల్లలు కూడా ఈ దారి గుండానే స్కూల్ కు వెళ్తుంటారు. దీని వల్ల చాలామంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఎక్కడపడితే అక్కడే చెత్తాచెదారం
వీకర్ సెక్షన్ కాలనీలో చాలామంది రోడ్డుపైనే చెత్తను పడేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఆ చెత్త వల్ల దుర్వాసన వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు. రోడ్డుపై గుంతలు, చెత్త గురించి సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడంలేదని, ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు.