- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మ్యాంగో’ ధరలు..పిరం..
దిశ, ఆదిలాబాద్: పండ్ల రారాజు ‘మామిడి’ ధరలు ఈసారి పిరమయ్యాయి. గతేడాదితో పోలిస్తే చాలా ఎక్కువగా ఉన్నాయని కస్టమర్లు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మామిడి పండ్లు వాటి రకాలను, నాణ్యతను బట్టి కిలో 80 రూపాయల నుంచి 200 దాకా పలుకుతున్నాయి. కరోనా ఎఫెక్ట్ మ్యాంగోపైనా పడింది. లాక్ డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల నుంచి మామిడి పండ్ల దిగుమతి గణనీయంగా తగ్గింది. గతంలో మహారాష్ట్రలోని నాగపూర్, చంద్రాపూర్, యవత్మాల్, రాష్ట్రంలోని హైదరాబాద్, నిజామాబాద్, జగిత్యాల ప్రాంతాల నుంచి నిర్మల్‌తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద మొత్తంలో పండ్ల దిగుమతి జరిగేది. ఈసారి 20 శాతం కూడా పండ్ల దిగుమతి కాలేదనీ, అందుకే ధరలు విపరీతంగా పెరిగాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
ఇక్కడ కాసిందీ తక్కువే..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మామిడి పంట కాత ఈసారి తక్కువగా ఉందని రైతులు అంటున్నారు. ఈ ఏడాది మామిడి పూత మొదలైనప్పటి నుంచి వరుసగా పిందె సమయంలోనూ ఈదురు గాలులు రావడం, వర్షాలు పడటం పంట నష్టానికి కారణమైంది. మిగిలిన మామిడికాయలను చెట్ల నుంచి దింపే సమయానికి చెడగొట్టు వానలు, గాలి దుమారం వంటి ప్రకృతి వైపరీత్యాలతో తీవ్ర నష్టం వాటిల్లింది. శాస్త్రీయ విధానంలో పండ్లు మాగబెట్టే విధానం ఈ ప్రాంతంలో లేకపోవడం కూడా ధర పెరగడానికి కారణమని పలువురు చెబుతున్నారు. గతంలో స్థానిక పండ్ల వ్యాపారులు విపరీతంగా కార్బైడ్ వినియోగించి కాయలను పండ్లుగా మార్చేవారు. ఇది ప్రాణాంతకం కావడంతో ఆహార తనిఖీ అధికారులు నిఘా పెట్టారు. గ్యాస్ ద్వారా మాగబెట్టే విధానాన్ని మాత్రమే
అనుమతిస్తున్నారు. దీంతో మామిడిపండ్ల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది.స్థానికంగా లభించే చెట్ల పండ్లు చిన్నగా ఉండటంతో ఆ పండ్లను 60 నుంచి 80 రూపాయలకే కొందరు అమ్ముతున్నారు. అయితే, హైబ్రిడ్ రకం మామిడి పండ్ల ధర మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. పెద్ద సైజులో ఉండి మంచి నాణ్యత ఉన్న బంగినపల్లి మామిడి పండ్లు 100 నుంచి 140 రూపాయల ధర పలుకుతోంది. రసాలు 150 రూపాయల దాకా లభిస్తున్నాయి. ఇక చీకుడు పండ్లుగా పేరున్న దసేరి రకం పండ్ల ధర కిలో రెండొందలు పలుకుతోంది. గతేడాదితో పోలిస్తే ధరలు రెట్టింపయ్యాయి.
రసాలు, దసేరి కొనే పరిస్థితి లేదు.
ఆదిలాబాద్ మార్కెట్‌లో మామిడి ధరలు ఇంత పెరగడం ఇదే మొదటిసారి. వ్యాపారులను అడిగితే కరోనా అంటున్నారు. రూ.100కు తక్కువ ఇవ్వం అంటున్నారు వ్యాపారులు. రసాలు, దసేరి కొనే పరిస్థితి లేదు.
-సుభాష్, కస్టమర్.
Tags: no import, prices, mango, very high, this year, compared, to last year, adilabad market, covid 19 effect