- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రచ్చకెక్కిన మండలపరిషత్ సర్వసభ్య సమావేశం…
దిశ, మణుగూరు : మణుగూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. గత సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను నేటికీ పరిష్కరించకపోవడంపై పలు గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీపీ కారం విజయకుమారి, ఎంపీడీవో వీరబాబు, జడ్పీటీసీ పాశం నరసింహారావు, వైస్ ఎంపీపీ కరివేద వెంకటేశ్వర్లు మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడుతూ… మిషన్ భగీరథ తాగునీటి సరఫరా సక్రమంగా రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సభదృష్టికి తీసుకొచ్చారు.
ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల మంచినీటి సమస్యలను పట్టించుకోకపోతే విషయం సీరియస్ గా ఉంటుందని మిషన్ భగీరథ అధికారులకు హెచ్చరించారు. మిషన్ భగీరథ అధికారులు ఏమాత్రం పనిచేయడం లేదని, భగీరథ పైపులు పగిలిపోయి, నీరు వృధాగా పోతున్న పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యహరిస్తున్నారని ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. మిషన్ భగీరథ మంచినీటి సమస్యలలో ప్రజలకు అందుబాటులో ఉండకుండాపోతే స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులకు హెచ్చరించారు.
అనంతరం ప్రజాప్రతినిధులు ఎక్సైజ్ శాఖ ఎస్సై తో మాట్లాడుతూ…
మండలంలో విపరీతంగా బెల్ట్ షాపులు నడుస్తున్న వాటిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. బెల్టు షాపుల వల్ల గ్రామాలలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని మాట్లాడారు. మండలంలో గంజాయ్ జోరుగా నడుస్తున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. ఎంతో మంది యువత గంజాయికి అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ ఇంతవరకు ఎన్ని గంజా కేసులు, నాటుసారా కేసులు, ఎన్ని బెల్టుషాపులు సీజ్ చేశారని సర్వసభ ముఖంగా అడిగారు. బెల్టు షాపులకు మీకు ఏమైనా ఒప్పందం ఉందా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ శాఖ ఎస్సై ప్రజాప్రతినిధులతో కళ్ళు బోళ్ళు మాటలు చెప్పి కాలయాపన చేశారని సర్వ సభ ముఖంగా తేటతెల్లమైంది. బెల్టు షాపులపై, నాటుసారా, గంజాయిపై దృష్టి పెట్టి పని చేయాలని ప్రజాప్రతినిధులు కోరారు.
సొసైటీ, ఐకేపీ అధికారితో మాట్లాడుతూ…
ప్రజల పట్ల అంకిత భావంతో కలిగి ఉండకుండా రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించకుండా ఒక బస్తకు తేమ పేరుతోటి నాలుగు కేజీలు, తాలు పేరుతో నాలుగు కేజీలు దోచుకున్నారన్నారు. కరోనా విపత్కర సమయంలో రైతులకు అండగా నిలిచి ఎటువంటి అక్రమాలకు తావులేకుండా చూడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించి రైస్ మిలర్లతో కుమ్మక్కై రైతులను నిలువున దోచుకొని జేబులు నింపుకున్నారన్నారు.
ఐటీడీఎ ఏఈ అధికారితో మాట్లాడుతూ…
నాణ్యతలేని డబుల్ బెడ్ రూమ్ లు నిర్మించడం ఇది ఏమైనా చర్య అని ప్రజా ప్రతినిధులు ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంలో కంకర, ఇసుక, సిమెంటు, స్టీల్ నాసిరకంగా వాడి నిర్మాణంలోనే కూలిపోతున్నాయని అధికారులపై మండిపడ్డారు. డబల్ బెడ్ రూమ్ లపై ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయని సంబంధిత ఏఈ,డిఈ పర్యవేక్షించి మెరుగైన విధంగా నిర్మాణాలు చేపట్టి ప్రభుత్వ లక్ష్యానికి చేరువవ్వాలని ప్రజా ప్రతినిధులు సూచించారు.