- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమిరేట్స్ టీ20 లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ జట్టు
దిశ, స్పోర్ట్స్: మాంచెస్టర్ యునైటెడ్ అనేది ఫుట్‌బాల్ జట్టు కదా? టీ20 క్రికెట్ లీగ్‌లో ఫుట్‌బాల్ క్లబ్ ఎలా పాల్గొంటున్నది అనే డౌట్ వచ్చిందా? అసలు విషయం ఏంటంటే.. త్వరలో ప్రారంభం కానున్న ఎమిరేట్స్ టీ20 లీగ్‌లో అవ్రమ్ గ్లేజర్ ఒక జట్టును కొనుగోలు చేశారు. మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌కు ఈ గ్లేజర్ ఫ్యామిలీనే యజమానులు. ఇటీవల ఐపీఎల్‌లో లక్నో లేదా అహ్మదాబాద్ జట్టును కొనుగోలు చేయాలని బిడ్ దాఖలు చేశారు. కానీ తక్కువ మొత్తం వేయడంతో ఫ్రాంచైజీని దక్కించుకోలేక పోయారు. ఏలాగైనా క్రికెట్ జట్టును కలిగి ఉండాలని కలలు కన్న గ్లేజర్ ఫ్యామిలీ చివరకు ఎమిరేట్స్ టీ20 లీగ్‌లో జట్టును కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని అవ్రమ్ గ్లేజర్ బుధవారం ప్రకటించారు.
‘యూఏఈలో నిర్వహించనున్న టీ20 లీగ్‌లో భాగస్వామ్యం అయినందుకు చాలా ఉత్సాహంగా ఉన్నది. యూఏఈలో ప్రపంచ స్థాయి టీ20 క్రికెట్ లీగ్‌ను నిర్వహించబోతున్నారు. అది తప్పకుండా అక్కడ క్రికెట్ అభివృద్దికి తోడ్పడుతుంది.’ అని గ్లేజర్ వ్యాఖ్యానించారు. మాంచెస్టర్ యునైటెడ్ జట్టు యాజమాన్యం యూఏఈ క్రికెట్ లీగ్‌లో పెట్టుబడులు పెట్టినందుకు లీగ్ చైర్మన్ ఖలీగ్ అల్ జరూనీ హర్షం వ్యక్తం చేశారు.