- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విధుల్లో నిర్లక్ష్యం.. ZPHS ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్
దిశ, కరీంనగర్ సిటీ : ప్రధానోపాధ్యాయురాలి హోదాలో ఉండి విధులు సరిగా నిర్వహించకుండా తోటి ఉపాధ్యాయురాలిని ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారిని సస్పెండ్ చేస్తూ డీఈవో గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటన మానకొండూరు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వెలుగుచూసింది. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న జ్యోతి అదే పాఠశాలలో పనిచేసి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన నళిని అనే సహఉపాధ్యాయురాలిని కోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సి ఉన్నా తనకేమీ పట్టనట్టుగా వ్యవహరించింది.
దీంతో సదరు ఉపాధ్యాయురాలు డీఈవోకు ఫిర్యాదు చేసింది. సదరు ఉద్యోగిని విధుల్లోకి తిరిగి తీసుకోకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ విద్యాధికారి మెమో జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో DEO విద్యాశాఖ ప్రాంతీయ సహాయ సంచాలకులు (REO)కు జ్యోతిపై పనితీరుపై నివేదిక పంపటంతో ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ (RJD) సత్యనారాయణ రెడ్డి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఏడాది కాలంగా విధుల్లోకి తీసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటం, కంటెమ్ట్ ఆఫ్ కోర్ట్ ఆర్డర్స్ కింద నళిని మరోసారి కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలుసుకుని ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.