- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అక్రమ పట్టాలకు కేరాఫ్ గా కట్టంగూరు

దిశ, నల్లగొండ బ్యూరో : భూముల ధరలకు రెక్కలు వచ్చిన తర్వాత ఆ మండలంలో విపరీతమైన భూ అక్రమాలు పెరిగిపోయాయి. రెవెన్యూ అధికారుల అండదండలతో భూ బకాసురులు కబ్జాలు చేస్తూ అక్రమంగా పట్టాలు చేసుకుని వాటి పై లబ్ధి పొందుతున్నారు. దానివల్ల కాస్తులో ఉన్న అసలైన రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది. కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 995/ఆ 2 లో పెద్ద లింగయ్యకు 2--12 ఎకరాల భూమి ఉంది. ఆయన మరణానంతరం వారసత్వంతో సంక్రమించిన 2-12 ఎకరాల భూమి నూకల వెంకటేశ్వర్లు పేరు మీద నమోదైంది. అయితే ఈ భూమిని వెంకటేశ్వర్లు నార్కట్ పల్లి మండలానికి చెందిన కురుమిళ్ళ రఘు రాంమూర్తికి నూకల వెంకటేశ్వర్లు 2020లో 2- 10 ఎకరాల భూమిని ( డాక్యుమెంట్ నెంబర్ (475/2020) విక్రయించారు. దాంతో ఇక ఆయన పై మిగిలింది కేవలం 2 గుంటలు మాత్రమే. ఇదిలా ఉంటే 1992 కంటే ముందు నుంచి వెంకటేశ్వర్లు తండ్రి పెద్ద లింగయ్య పేరు మీద ఉన్న 24 గుంటల భూమిని కూడ తన పేరుతో రికార్డుల్లో నమోదు చేయించుకున్నారు. దీంతో ఆయనకు 26 గుంటల భూమి మాత్రమే అధికారికంగా ఉంది.
లేని భూమిపై పీఏసిఎస్ నుంచి పంట రుణం..?
995/ఆ/2 సర్వే నెంబర్ లో 2--12, 995/ఆ/3 నెంబర్ లో 1-31 ఎకరాలతో కలిపి మొత్తం. 4-03 ఎకరాల వ్యవసాయ భూమి ఉందంటూ ఓ వ్యక్తి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నల్లగొండ రామగిరి బ్రాంచ్ నుంచి సుమారు రూ.4 లక్షలకుపై పంట రుణం దాదాపు 2016 సంవత్సరంలో తీసుకున్నారని సమాచారం. అయితే నాటి నేటి వరకు పంట రుణం తీసుకున్న ఆ రైతు ఒక్క రూపాయి కూడా రుణం చెల్లించలేదు దీంతో అధికారులు సంబంధిత భూమిని మార్చి 12న గ్రామ పంచాయతీ ఆవరణలో వేలం వేస్తున్నట్లు నోటీసు పంపించారు..
ఇదిలా ఉంటే పంట రుణం తెచ్చుకున్న రైతుకు రెవెన్యూ రికార్డులో 26 గుంటల కంటే ఎక్కువ భూమి లేదు. కానీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారులు మాత్రం రూ.4 లక్షలకు పైగా పంట రుణం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రుణం ఇవ్వడానికి ప్రధాన కారణం అధికారులు, సదరు రైతు కుమ్మక్కై ప్రభుత్వ సొమ్మును స్వాహా చేయడానికి కుట్ర పడినట్లు సమాచారం. ఈ తతంగం మొత్తంలో రైతు, అధికారులు కలిపి పంట రుణాన్ని వారంతా కలిపి పంచుకున్నట్లు సమాచారం. అయితే ఏ సర్వే నెంబరు చెప్పి ఓ వ్యక్తి రుణం తెచ్చుకున్నారో ఆ భూమిపై మరో రైతు ఏళ్ల తరబడి కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్నారు. తన భూమిని వేలం పాట పాడొద్దని, నెల రోజులు గడువు ఇస్తే... ఆ భూమి తనదేనని రుజువు చేసుకుంటానని అధికారులను కోరినట్లు తెలిసింది.
పెద్ద లింగయ్య కు ఆ భూమి ఎలా వచ్చిందంటే...?
కట్టంగూరు మండలం ఐటి పాలెం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 995లో 15-02 ఎకరాల భూమి ఉండేది. అందులో నుంచి 1992 సంవత్సరంలో ఏర్పాటైన ఎస్ఎల్బిసి కెనాల్ కు 2-12/ఆ 2 నుంచి 2-12 ఎకరాల భూమి పోయింది. దానికి సంబంధించిన పరిహారం ముగ్గురు రైతులకు ప్రభుత్వం అందజేసింది. అందులో. ఒకరు C/2811/90 నెంబర్ తో...రూ.13534, రెండో వ్యక్తి C/2808/90 నెంబర్ పేరుతో రూ.13,166, మూడో వ్యక్తికి రూ. 18,824 పరిహారం ప్రభుత్వం నుంచి అందినట్లు తెలిసింది. అయితే పరిహారం అందిన తర్వాత రెవెన్యూ అధికారులు రికార్డుల నుంచి ఆ భూమిని సంబంధిత రైతుల పేరు మీద నుంచి తొలగించలేదు. దీంతో ఇదే అదనుగా భావించిన పెద్ద లింగయ్య అనే వ్యక్తి సర్వే నెంబరు 995 నుంచి 2-12 ఎకరాల తన పేరు మీద రెవెన్యూ రికార్డులు అక్రమంగా నమోదు చేయించుకున్నారని విమర్శలు ఉన్నాయి. ఆయన మరణానంతరం ఆ భూమి తన కుమారుడైన వెంకటేశ్వర్లు పేరుతో రెవెన్యూ రికార్డులు అధికారులు నమోదు చేసినట్లు సమాచారం. ఇదే భూమిని తర్వాత వెంకటేశ్వర్లు విక్రయించారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
భూమి పట్టా పాసుపుస్తకాలు సరి చేయమంటే కేసులు..?
ఎస్ఎల్బీసీ సాగర్ కెనాల్ కు కేటాయించబడిన భూములను రెవెన్యూ రికార్డుల్లో తొలగించి , పట్టాలు పాసుపుస్తకాలు సరి చేయాలని కోరిన బాధిత రైతు పొడిచేటి శ్రీనివాస్ , ఆయనతో పాటు గా భార్య, తండ్రి పై అప్పటి ఎమ్మార్వో కేసు పెట్టారు. తన పరిధిలో పనిచేసిన వీఆర్ఓ చేత కట్టంగూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించారు 27--10--2021 రోజున 234/2021 ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. 353, 504, 506, R/W 34 IPC సెక్షన్లతో కేసు పెట్టి ఇప్పటికీ కోర్టు చుట్టూ తిప్పుతున్నట్లు సమాచారం. నాటి ఎమ్మార్వో భూ అక్రమిత రైతు ఇద్దరు కుమ్మక్కై బాధిత రైతును కేసుల పాలు చేసినట్లు తెలుస్తుంది. సమస్యను పరిష్కరించమని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఆక్రమిత రైతులతో కలిసి అధికారులు శిక్షలు విధించే పరిస్థితి రావడం దుర్మార్గం.
కెనాల్ కు పోయిన భూమి తొలగిస్తే సమస్య ఉండదు.. పొడిచేటి శ్రీనివాస్, బాధితుడు, అయిటిపాముల.
ఎస్ఎల్ బీసీ కెనాల్ కాల్వకు పోయిన భూమిని తొలగించడంతో పాటు భూముల పట్టాలను సరి చేస్తే ఈ సమస్య ఉండదు. మండల రెవెన్యూ అధికారులకు జిల్లా అధికారులకు సమస్య పరిష్కరించాలని సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగి చెప్పులు అడిగాయే తప్ప పరిష్కారం లభించలేదు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని సరి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.