ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ అభినందనీయం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 

by Shyam |
ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ అభినందనీయం: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ 
X

దిశ, కుత్బుల్లాపూర్: ఉచితంగా వైద్యసేవలందించడం అభినందనీయమని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధి చంద్రగిరి నగర్‌లోని ఏఎంఎస్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పేదలకు ఉచితంగా వైద్యం చేయడం సంతోషకరమని, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అలాగే ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రషీద్, మసూద్, అబీద్, ఇబ్రహీం, మధు బాబు తదితరులు పాల్గొన్నారు.

అలాగే 1927 డిసెంబర్ 19వ తేదీన ఆంగ్లేయులచే ఉరితీయబడిన స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు పండిత రాంప్రసాద్ బిస్మిల్ – అష్పఖుల్లా ఖాన్ స్మరణలో జరుగుతున్న హిందూ – ముస్లిం ఐక్యత దినోత్సవంలో భాగంగా బహుగ్రంథకర్త సయ్యద్ నసీర్ అహ్మద్ రచించిన ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామం, హిందూ ముస్లిం ఐక్యత పుస్తకాన్ని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆవిష్కరించారు. దూదిమెట్ల సోమేశ్ యాదవ్, ఖలీల్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed