సీపీ కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం

by Sridhar Babu |
సీపీ కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
X

దిశ, కరీంనగర్: పట్టణంలోని సీపీ కార్యాలయం ముందు ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపాలపూర్ గ్రామానికి చెందిన విజయ్ చిట్ల అనే వ్యక్తి శనివారం కరీంనగర్ సీపీ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుగ్గారం జడ్పీటీసీ భాదినేని రాజేందర్ అతని అనుచరుల ప్రోద్బలంతోనే స్థానిక ఎస్సై తనపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

దీంతో వేధింపులు తట్టుకోలేక పోలీస్ కమిషనరేట్ ముందు అత్మహత్య చేసుకుంటున్నట్లు బాధితుడు వాపోయాడు. తాను అత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సూసైడ్ లెటర్ రాశాడు. బాధితుడి ఆత్మహత్యాయత్నం ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

Next Story

Most Viewed