- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇతని వైపు ఓసారి చూడండి.. అచ్చం కేజ్రీవాల్ లాగే ఉన్నాడు కదా..?
దిశ, వెబ్ డెస్క్: ఒక మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని చూస్తే ఇది నిజమేమో అని అనిపిస్తోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లాగే ఓ వ్యక్తి ఉన్నాడు. ఇది చెప్పగానే మీరు ఆశ్చర్యపోతున్నారా..? అవును.. ఇది అక్షరాల నిజం. అతను ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో ఉన్నాడు. అక్కడ అతను చాట్ బండి నడిపిస్తూ కనిపించాడు. అతనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్ లోని పూల్ బాగ్ ఏరియాలో చాట్ బండి నడిపిస్తున్న గుప్తా అనే వ్యక్తి ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అతను చూడ్డానికి అచ్చం కేజ్రీవాల్ లాగే ఉన్నాడు. కొంచెం హైట్ తక్కువుంటాడు తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఉ. 11 నుంచి సా.5 గంటల వరకు చాట్ బండి నడిపిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని బండి వద్ద పాపిడి చాట్, పాలక్ చాట్ తోపాటు రకరకాలైన పదార్థాలను చేసి అమ్ముతుంటాడు. ఇతనికి ఆ ఏరియాలో మంచి పేరుంది. జనాలు కూడా ఇతను విక్రయించే పదార్థాలకు ఫిదా అవుతుంటారు.
ఓ యూట్యూబర్ గుప్తాను గమనించి అతనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం అవి ఇంటర్నెట్ లో తెగ వైరలవుతున్నాయి. నెటిజన్స్ నుంచి వాటికి భారీ స్పందన వస్తోంది. అయితే.. కేజ్రీవాల్ ను పోలి ఉన్న గుప్తా.. రియల్ కేజ్రీవాల్ ను కలవాలనుకుంటున్నాడు.. చూడాలి మరీ.. గుప్తా కోరిక తీరుతుందో లేదో అనేది.