బాలికపై అత్యాచారం.. నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష

by Sumithra |
Jail
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పదేళ్ల బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన కేసులో నిందితుడికి కోర్టు 10 సంవత్సరాల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. బోధన్ పట్టణంలోని బెల్లాల్‌‌కు చెందిన బత్తుల కృష్ణ అలియాన్ కృష్ణమూర్తి (58) అనే వ్యక్తి పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించినట్లు బోధన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 2019లో నమోదైన కేసులో అప్పటి బోధన్ టౌన్ సీఐ నాగార్జున గౌడ్, ప్రస్తుత సీఐ పీడీ ప్రేమ్ కుమార్‌లు విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో రెండవ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు విచారణ జరిపి నిందితుడు బత్తుల కృష్ణకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష , 1000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. జరిమానా కట్టకపోతే మరో మూడు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించి నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన పోలీసులను కమిషనర్ కార్తికేయ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed