యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద కారు బీభత్సం.. డ్రైవర్ కాల్చివేత

by vinod kumar |
యూఎస్ క్యాపిటల్ భవనం వద్ద కారు బీభత్సం.. డ్రైవర్ కాల్చివేత
X

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా క్యాపిటల్ భవనం వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. క్యాపిటల్ భవన్ వద్ద భద్రతా సిబ్బందిపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. అయితే, వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. కారు డ్రైవర్‌పై కాల్పులు జరిపారు.

దీంతో డ్రైవర్ ఘటన స్థలంలోనే మృతిచెందగా.. కారు డ్రైవర్ దగ్గర కత్తి లభించనట్టు భద్రతా సిబ్బంది వెల్లడించారు. భద్రతా కారణాల దృష్ట్యా క్యాపిటల్ భవనాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు.



Next Story

Most Viewed