- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సినిమాటిక్ ప్రపోజల్.. గాలిలో ప్రేయసికి డైమండ్ రింగ్
దిశ, ఫీచర్స్ : ప్రేమించడం సులువే కానీ, ఆ ప్రేమను వ్యక్తపరచడం ఎంత కష్టమో ప్రేమికులను అడిగితే చెప్తారు. అదే ఇంకొంచెం యూనిక్ స్టైల్‌లో ప్రపోజ్ చేయాలంటే ఇంకాస్త కష్టపడాల్సిందే. కాగా ‘రే’ అనే పైలట్.. తన గర్ల్ ఫ్రెండ్‌కు వినూత్నంగా ప్రపోజ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది అసాధ్యమైన ప్రపోజల్, అస్సలు నమ్మశక్యంగా లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సాహస క్రీడలను అమితంగా ఇష్టపడే పైలట్ ‘రే’.. తన గర్ల్ ఫ్రెండ్ క్యాతీతో తను ప్రేమిస్తున్న విషయం చెప్పేందుకు వినూత్నంగా ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా ఆమెను స్కై డైవ్‌కు తీసుకెళ్లిన రే.. ఆకాశ వీధిలో విహరిస్తూ ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ప్యారాచుట్ కిందకు వస్తున్న సమయంలో అరచేతిలో డైమండ్ రింగ్ చూపించాడు. ఈ ప్రపోజల్‌కు క్యాతీ వెంటనే ఓకే చెప్పడంతో వారి ప్రేమకథకు శుభం కార్డు పడింది. ఇక ఈ వీడియో ‘స్కై డైవ్ మ్యారేజ్ ప్రపోజల్’ క్యాప్షన్‌తో నెట్టింట వైరల్‌గా షేర్ అవుతుండటం విశేషం. కాగా ఖరీదైన డైమండ్ రింగ్ ఎక్కడ కింద పడుతుందేమోనని వీడియో చూస్తున్నంత సేపు టెన్షన్ పడ్డామని, రే ప్రపోజల్‌ను క్యాతీ యాక్సెప్ట్ చేయడం ఆనందం కలిగించిందని, ఈ సంఘటన వారి జీవితంలో మరుపురాని అ‘పూర్వ’ జ్ఞాపకంగా మిగిలిపోతుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CLyADR8n5e8/?utm_source=ig_embed