- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గర్ల్‌ఫ్రెండ్‌తో ప్రాంక్.. నెటిజన్ల ఫైర్!
దిశ, వెబ్‌డెస్క్ :
ప్రాంక్ వీడియోల గురించి అందరికీ తెలిసిందే. ఎవరినైనా ఆటపట్టించేందుకు.. ఫన్నీ యాక్ట్స్ చేస్తూ ప్రేక్షకుల అటెన్షన్‌ను డ్రా చేస్తుంటారు. ఈ తరహా ప్రాంక్ వీడియోలపై ఇప్పటికే ఎన్నోసార్లు విమర్శలు రాగా, ఇంకా వస్తూనే ఉన్నాయి. అమలాపాల్ హీరోయిన్‌గా చేసిన ‘ఆమె’ సినిమా కూడా ప్రాంక్‌ల నేపథ్యంలో తీసిందే. ప్రాంక్ తీసేవారికి, చూసేవారికి సరదా కావచ్చేమో కానీ, ఆ ప్రాంక్ ప్రయోగించబడే వారు మాత్రం తప్పక హర్ట్ అవుతారు. తాజాగా ఓ ప్రాంక్ స్టార్.. తన ప్రేయసిని ఆటపట్టించడానికి ఓ చిలిపి పని చేశాడు. ఆ వీడియో వైరల్ కావడంతో సదరు ఆ ప్రేమికుడిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
‘గర్ల్‌ఫ్రెండ్ మీద జోకులు వేస్తుంటారు, సరదాగా ఆటపట్టిస్తుంటారు, ఫన్నీగా భయపెట్టిస్తుంటారు’ ఇవన్నీ సర్వసాధారణమే. కానీ, ప్రాంక్ స్టార్ జులియస్ డీన్ చేసిన ప్రాంక్ మాత్రం తన ప్రేయసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉంది. దీంతో అందరూ జులియస్‌ను విమర్శిస్తున్నారు. ఇంతకీ అతను ఏం చేశాడంటే? జులియస్ డీన్, అతని గర్ల్‌ఫ్రెండ్ ఎస్టెల్లే.. తమ హాలిడేను ఆనందంగా గడపడానికి ఓ బీచ్‌కి వెళ్లారు. ఎస్టెల్లే ఆన్‌లైన్‌లో ఓ బికినీ కొనుక్కుంది. కానీ, జులియస్ మాత్రం ఆమె కొనుక్కున్న బికీనీ బదులు వేరే బికినీ ఇచ్చాడు. అయితే, అది డిసాల్వ్ బికినీ. అంటే.. దానికి నీరు తగిలితే వెంటనే కరిగిపోతుంది. ఇదంతా తెలియని ఎస్టెల్లే.. ఆ బికినీ వేసుకుని వాటర్‌లోకి వెళ్లింది. జులియస్ తర్వాత వస్తానంటూ.. ఆమె వీడియో తీయడం ప్రారంభించాడు. ఆమె నీళ్లలోకి వెళ్లిన కొన్ని సెకన్ల తర్వాత ఆ బికినీ కరిగిపోయింది. తన ఒంటిపై బికినీ లేకపోవడంతో ఆశ్చర్యపోయిన ఎస్టెల్లా తన చుట్టూ వెతికింది కానీ, కనిపించలేదు. ఆ తర్వాత టవల్ ఇవ్వడంతో నీటిలో నుంచి బయటకు రాగలిగింది. అయితే ఫేస్‌బుక్‌లో పెట్టిన ఈ వీడియో.. తెగ వైరల్ కాగా, అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. అమ్మాయిల విషయంలో ఇలాంటివి చేయడం సరికాదని కొందరు, ఇలాంటి ప్రాంక్ వీడియో చేయడం సిగ్గుగా లేదా అని ఇంకొందరు, అసలు అది నిజమైన వీడియో కాదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ప్రాంక్ చేసినా కూడా.. అది చేసిన వాళ్లకు, చేయించుకున్నవాళ్లకు ఓ సంతోషకరమైన జ్ఞాపకంగా నిలిచిపోవాలే కానీ.. నవ్వులపాలు చేయకూడదు.