సమస్యపై సర్పంచ్‌ ఇంటికి పోతే.. భర్త దాడి

by Sumithra |
సమస్యపై సర్పంచ్‌ ఇంటికి పోతే.. భర్త దాడి
X

దిశ, హుస్నాబాద్: భూమి వివాదాన్ని పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్‌ను ఓ వ్యక్తి కలిశాడు. దీంతో అతనిపై సర్పంచ్ భర్త దాడి చేశాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చాపగాని తండాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చాపగాని తండాకు చెందిన గుగులోతు హన్మ అనే వ్యక్తి తన సోదరుడితో ఉన్న భూతగాదాను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్‌ను ఆశ్రయించడానికి ఆమె ఇంటికి వెళ్లగా.. సర్పంచ్ భర్త వీరన్న…అతనిపై కర్రతో దాడి చేశాడు. దీంతో బాధితుడు హన్మ తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story