- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూరిన్ థెరపీ తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్ :
అనామిటిక్ థెరపీ, ఆక్యుప్రెషర్ థెరపీ, ప్రోటాన్ థెరపీ.. ఇప్పుడు ప్లాస్మా థెరపీ. ఇలా ఎన్నో రకాల థెరపీలు చూసే ఉంటారు. కానీ ‘యూరిన్ థెరపీ’ గురించి విని ఉండరు. వ్యాధులను నయం చేయడానికి, డిప్రెషన్ నుంచి బయటపడటానిక ఈ థెరపీ గొప్ప మెడిసిన్‌గా పనిచేస్తుందని అంటున్నాడు.. జర్మనీకి చెందిన 26 ఏళ్ల జాన్. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.
చాలావరకు ఆయుర్వేదిక్ షాపుల్లో ‘గో మూత్రం’ లభిస్తుందని అందరికీ తెలుసు. పలు రకాల వ్యాధులను నయం చేసేందుకు గోమూత్రం చక్కగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. అయితే, ఈ జర్మన్ యువకుడు మాత్రం.. ‘తన మూత్రమే సర్వరోగ నివారిణి’ అనే అనేస్తున్నాడు. అందుకే.. ప్రతి రోజు 7 గ్లాసుల మూత్రాన్ని తాగుతున్నాడు. 2017లో ‘శివంబు కల్ప లేదా యూరిన్ థెరపీ’ గురించి తెలుసుకున్నాడు. ఆనాటి నుంచి ఈ థెరపీనే ఫాలో అవుతున్నాడు. తన సొంత మూత్రాన్ని తాగడం వల్ల.. డిప్రెషన్ నుంచి కూడా బయటపడ్డట్టు జాన్ చెబుతుండటం విశేషం. తన మాత్రాన్ని ముక్కు, చెవుల్లో కూడా పోసుకుంటూ.. శరీరాన్ని చక్కగా మర్దనా చేసుకుంటుండటం గమనార్హం.
‘యూరిన్ థెరపీ గురించి నేను యూట్యూబ్‌లో చూశాను. ఒకసారి ప్రయత్నిద్దామనే ఉద్దేశంతో మూత్రాన్ని తాగడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి నాలో ఊహించని మార్పులు కనిపించాయి. మూత్రం తాగడం వల్ల నా ఎనర్జీ లెవెల్స్ పెరిగాయి. అన్ని వైరస్‌లకు, రోగాలకు ఇది మంచి మందు. మన శరీరం అందించే నేచురల్ వ్యాక్సిన్ ఇది. యూరిన్ థెరపీ వల్ల.. నేను ఎంత చెత్త తిండి తిన్నా శరీరం తట్టుకుంటోంది. ఈ థెరపీ వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాను. ఏ రోజూ అనారోగ్యానికి గురికాలేదు’ అని జాన్ తెలిపాడు. అంతేకాక యూరిన్ థెరపీ గురించిన తన అనుభవాలను జాన్ ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లోనూ పెడుతూ ఉంటాడు.